పదిహేడో సీజన్‌లో అత్యధిక స్కోర్‌తో చరిత్ర తిరగరాసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేజింగ్‌లో మరోసారి ఫెయిలయ్యింది. ఆర్సీబీపై 35 పరుగుల ఓటమిని మర్చిపోక ముందు చెన్నై సూపర్ కింగ్స్ చేతితో కంగుతిన్నది.సొంత మైదానంలో తుషార్ దేశ్‌పాండే(4/27), పథిరన (2/27)లు ఆరెంజ్ ఆర్మీ హిట్టర్లకు ముకుతాడు వేశారు.
213 పరగుల ఛేదనలో టాపార్డర్ చేతులెత్తేయగా.. సూపర్ కింగ్స్ 78 రన్స్ తేడాతో గెలిచింది. వరుసగా రెండు ఓటముల తర్వాత బ్యాటుతో, బంతితో అదరగొట్టిన చెన్నై ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.చెపాక్ స్టేడియంలో సీఎస్కే నిర్దేశించిన 213 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆది నుంచి తడబడింది.
రికార్డు ఫిఫ్టీలు బాదిన ఓపెనర్లు ఓపెనర్ ట్రావిస్ హెడ్(10), అభిషేక్ శర్మ(15) మరోసారి నిరాశపరచగా.. తుషార్ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్లో.. రెండు బంతుల్లో హెడ్, ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అన్మోల్‌ప్రీత్ సింగ్(0) ఔటయ్యారు. 21 పరుగులకే రెండు వికెట్లు పడినా.. ఓపెనర్ అభిషేక్, మర్క్‌రమ్(32)లు పట్టుదలగా ఆడారు..