క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం 2025 మొదలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ప్రారంభమైంది. కాగా, ఐపీఎల్ మెగా వేలం 2025లో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ… ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.27 కోట్లకు పంత్ ను సొంతం చేసుకుంది.
ఈ వేలంలోనే మొదట శ్రేయాస్ అయ్యర్ అత్యధిక ధరకు (పంజాబ్ కింగ్స్ రూ.26.7) అమ్ముడుపోయి రికార్డు సెట్ చేయగా.. కొద్దిసేపటికే పంత్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. రూ.2 కోట్ల కనీస ధరకు వేలంలోకి వచ్చిన పంత్ కోసం.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మొదట పోటీ పడ్డాయి. ఇరు జట్లూ రూ.20 కోట్ల వరకు పాడేశాయి. అయితే.. ఒక్కసారి లక్నో సూపర్ జెయింట్స్ ఈ మొత్తాన్ని రూ.7 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పంత్ ను సొంతం చేసుకుంది.
బౌలర్లపై కాసుల వర్షం
ఆక్షన్‌లో అర్ష్‌దీప్ సింగ్ రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో రాగా…. ఆఖరికి అతడిని ఆర్‌టీఎమ్ కార్డును ఉపయోగించి పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు దక్కించుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు షమీని రూ.10 కోట్లకు సొంతం చేసుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన యుజ్వేంద్ర చాహల్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోగా.. పేసర్ మహ్మద్ సిరాజ్‌ను రూ.12.25 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.