Sunday, November 24, 2024

IPL Mega Auction | పంత్ కోసం పోటీ !

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం 2025 మొద‌లైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదిక‌గా ప్రారంభ‌మైంది. కాగా, ఐపీఎల్ మెగా వేలం 2025లో టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ చ‌రిత్ర సృష్టించాడు. గ‌త రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ… ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు రూ.27 కోట్ల‌కు పంత్ ను సొంతం చేసుకుంది.

ఈ వేలంలోనే మొదట శ్రేయాస్ అయ్యర్ అత్య‌ధిక ధ‌ర‌కు (పంజాబ్ కింగ్స్ రూ.26.7) అమ్ముడుపోయి రికార్డు సెట్ చేయ‌గా.. కొద్దిసేపటికే పంత్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. రూ.2 కోట్ల క‌నీస ధ‌ర‌కు వేలంలోకి వ‌చ్చిన పంత్ కోసం.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మొదట పోటీ పడ్డాయి. ఇరు జట్లూ రూ.20 కోట్ల వరకు పాడేశాయి. అయితే.. ఒక్కసారి లక్నో సూపర్ జెయింట్స్ ఈ మొత్తాన్ని రూ.7 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పంత్ ను సొంతం చేసుకుంది.

గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

రూ. 3.4 కోట్లకు మిచెల్ మార్ష్‌ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

- Advertisement -

మార్కస్ స్టోయినీస్‌ను రూ. 11 కోట్లకు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్

వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న కేకేఆర్

రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 9.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.

న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4 కోట్లకు ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసింది.

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రీజర్-మెక్ గుర్క్‌ను పంజాబ్ కింగ్స్.. 5.50 కోట్లకు సొంతం చేసుకోగా.. ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 9 కోట్లకు సొంతం చేసుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దాంతో అతను అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరాడు. అయితే మరోసారి అతన్ని వేలం వేసే అవకాశం ఉంది.

టీమిండియా యువ బ్యాటర్ రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 3.40 కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకే ఎంపికయ్యాడు.రూ. 6.25 కోట్లకు ఆ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకే కొనుగోలు చేసింది.

దేవదత్ పడిక్కల్ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు. దాంతో అతను అన్‌సోల్డ్‌గా నిలిచిపోయాడు. మరోసారి అతను వేలంలోకి వచ్చే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు సొంతం చేసుకుంది.

కేఎల్ రాహుల్‌ను పట్టించుకోని ఆర్‌సీబీ. టీమిండియా స్టార్ బ్యాటర్‌ కేఎల్ రాహుల్‌ను ఆర్‌సీబీ పట్టించుకోలేదు. మెగా వేలంలో అతని కోసం రూ. 11 కోట్ల వరకే బిడ్ వేసిన ఆర్‌సీబీ ఆ తర్వాత తప్పుకుంది. దాంతో అతను రూ. 14 కోట్ల అతి తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతమయ్యాడు.

ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను ఆర్‌సీబీ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు రిప్లేస్‌మెంట్‌గా అతన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటార్స్ రూ. 12 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్‌టీఎమ్ కార్డ్ కింద అతన్ని తీసుకునేందుకు ఆర్‌సీబీ నిరాకరించింది.

ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికి స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 7.5 కోట్లకు సొంతం చేసుకుంది.

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10 కోట్లకు సొంతం చేసుకుంది. కేకేఆర్‌తో పోటీపడి మరి దక్కించుకుంది.

గత వేలంలో రూ.24.75 కోట్లు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ ఈసారి రూ.11.25 కోట్లు మాత్రమే దక్కించుకున్నాడు. స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

జోస్ బట్లర్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.15.75 కోట్లకు సొంతం చేసుకుంది

కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. తమ మాజీ ప్లేయర్‌పై పంజాబ్ కింగ్స్ RTM కార్డ్‌ ఉపయోగించలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement