టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ రీఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ అయింది. పంత్ తన పూర్తి ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. ఐపీఎల్లో పంత్ ఆడేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో పంత్ పునరాగమనం చేయనున్నాడు.
2022 డిసెంబర్ నుంచి క్రికెట్‌కు పంత్ దూరమైన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని నెలలు నడవడానికే కష్టపడిన పంత్ నెమ్మదిగా అడుగులు వేశాడు. క్రమంగా పరుగులు పెట్టాడు. కఠోరంగా శ్రమించి మునుపటిలా పూర్తి ఫిట్నెస్ అందుకున్నాడు.
అయితే కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్‌కు అప్పగించడంపై తుది నిర్ణయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తీసుకోనుంది. ఇప్పుడే కోలుకున్న పంత్‌పై పనిభారం మోపకూడదని భావిస్తే గ్లవ్స్ బాధ్యతలను అతనికి అప్పగించరు. కానీ కెప్టెన్‌గా పంత్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఢిల్లీ సారథి బాధ్యతలు పంత్‌యే నిర్వహిస్తాడని గతంలో ఢిల్లీ మెంటార్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాఉ
గత సీజన్లో పంత్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను డేవిడ్ వార్నర్ నడిపించాడు. ఐపీఎల్ 2023లో ఢిల్లీ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నుంచి రెండో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఢిల్లీ అయిదు మ్యాచ్‌లు మాత్రమే సాధించింది. మరి పంత్ రీఎంట్రీతో ఢిల్లీ పరిస్థితి మారుతుందేమో చూడాలి. కప్ ముద్దాడాలనే కల 2024 సీజన్లో అయినా నెరవేరుతుందేమో చూడాలి.