Monday, November 18, 2024

T20 World Cup : రింకూని సెల‌క్ట్ చేయాల్సిందే…

రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్
మార్పుకు ఈ నెల 15వ‌ర‌కు అవ‌కాశం
త‌ప్పును స‌రిదిద్దుకోమంటున్న సీనియ‌ర్లు

మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం భారత సెలె క్టర్లు 15 మందితో కూడి న జట్టును ప్రకటించిన విష యం తెలిసిందే. అయితే ధోనీ తర్వాత టీమిండి యాకు రింకూ సింగ్‌ రూపంలో మరో గొప్ప ఫినిషియర్‌ దొరికాడని అందరూ సంబర పడు తుంటే.. మరోవైపు భారత సెలెక్టర్లు అతడిని ప్రపంచకప్‌ జట్టులో చోటు ఇవ్వకుండా పక్క నపెట్టేశారు.

- Advertisement -

ఇప్పుడు అదే విషయం విమర్శలకు దారి తీసింది. రింకూ భారత్‌ తరఫున ఇప్పటివరకు 15 టీ20 మ్యాచులు ఆడాడు. అందులో 176 స్ట్రయిక్‌ రేటుతో 356 పరుగులు చేశాడు. అతడి సగటు కూడా 89గా ఉంది. అలాంటి టీ20 స్పెషలిస్ట్‌ ఫినిషి యర్‌కి ప్రపంచకప్‌ జట్టులో చోటు ఇవ్కకపో వడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.

ఈ విషయంపై తాజాగా టీమిండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ స్పందిసూ.. నా దృష్టిలో ఇదొక చెత్త నిర్ణయం. పవర్‌ హిట్టర్‌, గొప్ప ఫినిషియర్‌ రింకూ సింగ్‌ను వరల్డ్‌కప్‌ జట్టులో చోటు కల్పించకపోవడం అత్యంత చెత్త నిర్ణయ మని నేను భావిస్తున్నా. ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. భారత్‌ తరఫున రింకూ సింగ్‌ ఆడిన అన్ని మ్యాచు ల్లో సత్తా చాటాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో టీమిండియాను గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో జరిగిన సిరీస్‌లో విజ యవంతంగా ఫినిషియర్‌ పాత్ర పోషించాడు. స్వదేశంలో అఎn్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లొ నూ మెరుగ్గా ఆడి అందరి మనసులు దోచుకున్నా డు. ఇప్పుడు అలాంటి ఆటగాడిని కీలకమైన ప్రపం చకప్‌ జట్టులో చోటు ఇవ్కకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అని శ్రీకాంత్‌ పేర్కొన్నా డు. జట్టులో నలుగురు స్పిన్నర్ల అసరం ఏముంద ని ఆయన ప్రశ్నించాడు. జైస్వాల్‌ స్థానంలో రింకూ సింగ్‌ను ఆడించాలని నేను కోరుకుంటున్నాను అని శ్రీకాంత్‌ అన్నాడు.

టీమిండియా మరో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కూడా రింకూ సింగ్‌ విష యంలో స్పందించా డు.. టీ20ల్లో రిం కూ సింగ్‌ అద్భుతమైన ఆటగా డిగా గుర్తింపు తెచ్చు కుంటున్నా డు. అత డు ఆడిన దాదాపు అన్ని మ్యాచుల్లో తనని తాను ప్రూఫ్‌ చేసుకు న్నాడు. టీమిం డియా తర ఫున ఆడిన మ్యాచుల్లో దూకుడైన స్ట్రయిక్‌ రేటు, మంచి సగటుతో కీలకమైన పరుగులు రాబట్టాడు. ఇక ప్రపంచకప్‌ తుది జట్టు లోనూ అతడి స్థానం ఖాయ మని నేను భావించాను. కానీ అలా జరగ లేదు. భారత సెలెక్టర్లు అతడిని కనీసం 15 మందితో కూడిన జట్టులోనూ చోటు ఇవ్వక పోవడం నాకు షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో రింకూకు ఎక్కువ అవకాశాలు రాలేకపోవడం వాస్తవం. అలాంటప్పుడు ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఆధా రంగా అతడిని తప్పించడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఐపీఎల్‌ ఆటతీరును ప్రామాణికంగా తీసుకోని జట్టును ఎంపిక చేస్తే.. మరి హార్దిక్‌ పాండ్య, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు చోటు ఎలా లభించింది అని ఆకాశ్‌ చోప్రా ప్రశ్నించారు. మొత్తంగా కొంత మందిని సంతోషపెట్టడానికి రింకూ సింగ్‌ను బలి పశువు చేశారు. తన దృష్టిలో ఇదొక చెత్త సెలెక్షన్‌ అని చోప్రా అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement