Monday, October 7, 2024

Tennis | సెమీస్‌లో రిబాకినా, బర్బోరా..

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నాలుగో సీడ్‌ ఎలినా రిబాకినా సునాయాసమైన విజయంతో సెమీస్‌లో ప్రవేశించగా.. మరో మ్యాచ్‌లో 13వ సీడ్‌ జెలినా ఓస్టాపెంకోకు 31వ సీడ్‌ బర్బోరా క్రెజ్‌సికోవా షాకిచ్చింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో కజకిస్తాన్‌ స్టార్‌, నాలుగో సీడ్‌ ఎలినా రిబాకినా 6-3, 6-2 తేడాతో 21వ సీడ్‌ ఎలినా స్వీటొలినా (ఉక్రెయిన్‌)ను వరుస సెట్లలో చిత్తు చేసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

మరో మ్యాచ్‌లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బర్బోరా క్రెజ్‌సికోవా 6-4, 7-6 (7-4) తేడాతో లట్వియా స్టార్‌ క్రీడాకారిణి ఓస్టాపెంకోపై అద్భుత విజయం సాధించి టోర్నీలో ముందంజ వేసింది. దాంతో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మరో స్టార్‌ ప్లేయర్‌ ఓస్టాపెంకో పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement