Wednesday, November 6, 2024

Breaking: పాక్‌పై ప్ర‌తీకారం.. ఆసియాక‌ప్ టోర్నీలో గెలిచిన టీమిండియా

ఆసియా క‌ప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్ ఆరంభంలో కాస్త ప‌ర్వాలేదు అనిపించినా 10 ఓవ‌ర్లు అయ్యేస‌రికి డీలాప‌డింది. పాకిస్తాన్‌ని బౌలింగ్‌లో క‌ట్ట‌డి చేసినప్ప‌టికీ బ్యాటింగ్‌లో అంత‌గా ఆక‌ట్టుకోలేదు. అయినా ఐదు వికెట్లు కోల్పోయి 148 ప‌రుగుల చేజింగ్‌ని ఈజీగానే చేసింది.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడిన టీమిండియా సారధి రోహిత్ శర్మ (12) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. మహమ్మద్ నవాజ్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన రోహిత్‌.. చివరి బంతికి కూడా సిక్సర్ బాదడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సరిగా కనెక్ట్ చెయ్యలేకపోవడంతో లాంగాఫ్‌లో ఉన్న ఇఫ్తికార్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 8 ఓవర్లలో 50/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత కొద్దిసేప‌టికే అదే తరహా షాట్ ఆడబోయిన విరాట్ కోహ్లీ (35) కూడా అవుటయ్యాడు. కోహ్లీ కూడా నవాజ్ బౌలింగ్‌లో అహ్మద్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఆ త‌ర్వాత సూర్య‌కుమార్ యాద‌వ్‌, జ‌డేజా స్కోరు బోర్డును ప‌రుగులెత్తించే ప‌నిచేశారు. సూర్య‌కుమార్ అడ‌పాద‌డ‌పా బాదిన ఫోర్ల‌తో స్కోరుబోర్డు ముందుకు క‌దిలింది..

ఇక‌.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 148 ప‌రుగులు చేసింది టీమిండియా. ఇందులో రోహిత్ (12), రాహుల్ (0), కోహ్లీ (35), జ‌డేజా (35), సూర్య‌కుమార్ యాద‌వ్ (18) హార్దిక్ పాండ్యా 33, దినేశ్ కార్తీక్

Advertisement

తాజా వార్తలు

Advertisement