టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌లో సత్తా చాటుతున్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హిట్ మ్యాన్ దూకుడైన బ్యాటింగ్‌తో రాణిస్తున్నాడు. అయితే ఇటీవల రోహిత్ శర్మ బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో రోహిత్ శర్మ తన రిటైర్మింట్ గురించి ఆసక్తికర వాఖ్యా లు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకే ఆలోచన లేదు. అయితే జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చెప్పలేం.
ప్రస్తుతం నేను బాగానే ఆడుతున్నాను. మరికొన్నేళ్ల పాటు ఆడగలననే నమ్మకం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంతో చెప్పలేం. భారత్ తరఫున పెద్ద టోర్నీలు గెలవానేదే నా కోరిక. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాను. టీమిండియాకు మరో ప్రపంచప్ ట్రోఫీ అందించాలనేది నా కోరిక. దాంతో పాటు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్-2025 ఫైనల్‌లోనూ భారత జట్టును విజేతగా నిలపాలని ఉంది. ఈ రెండూ కళలు సహకారం చేసుకోవాలనేదే నా ముందున్న పెద్ద టార్గెట్. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ చివరి వరకూ అద్భుతంగా పోరాడాం కానీ ఆఖర్లో అదృష్టం మాత్రం ఆస్ట్రేలియాకే వరించింది. ప్రపంచకప్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోవడం చాలా బాధకరమైన విషయం.
దాన్ని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడింది. ఇప్పుడు మళ్లిd కొత్త ప్రయత్నాలు చేసుకొంటూ ముందుకు సాగిపోవాలి అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇక ఇటీవల హిట్‌మ్యాన్ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వచ్చిన రోమర్స్‌కు బీసీసీఐ చెక్ పెట్టింది. త్వరలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టుకు రోహిత్ శర్మనే సారథ్యం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. కాగా, ఈ ఏడాది జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ సమరం మొదలు కానుంది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నారు.