అహ్మాదాబాద్ – గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 205 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు కోల్ కతా బ్యాటింగ్ కు దిగింది.. ఓపెనర్లు రెహమానుల్లా గర్బాజ్ ., నారాయణ్ జగదీశన్ లు నెమ్మది బ్యాటింగ్ ప్రారంబించారు.. అయితే షమీ తొలి దెబ్బతీశాడు.. దూకుడుగా ఆడుతున్న రెహమానుల్లాను ఔట్ చేశాడు.. రెహమానుల్లా 15 పరుగులు చేశాడు. కోల్ కతా మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది.. క్రీజ్ లో జగదీశన్, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు..
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ విజయ్ శంకర్ మెరుపు బ్యాటింగ్ తో గుజరాత్ నేటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్ చేసింది.. నిర్దారిత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేసింది.. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం కోసం 205 పరుగులు చేయవలసి ఉంది. ఆరో వికెట్ గా బరిలోకి దిగిన విజయ శంకర్ చివరిలో మెరుపు బ్యాటింగ్ చేశాడు.. కేవలం 24 బంతులలో అయిదు సిక్స్ లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేశాడు..
అంతకు ముందు నాలుగో వికెట్ గా సాయి సుదర్శన్ 53 పరుగులు చేసి నరైన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు . అలాగ9 అభినవ్ మనోహార్ 14 పరుగులు చేసి సయేష్ శర్మ చేతిలో మూడో వికెట్ గా వెనుతిరిగాడు.. రెండో వికెట్ గా 39 పరుగులు చేసిన శుభమన్ గిల్ ను సునీల్ నారాయణ్ ఔట్ చేశాడు.. గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి204పరుగులు చేసింది.. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్స లో సునీల్ నరైన్ కు మూడు వికెట్లు లభించగా, సయేష్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.
కాగా, నేటి మ్యాచ్ గుజరాత్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు.. రషిద్ జట్టుకు నాయకత్వ వహిస్తున్నాడు.. హర్దిన్ స్తానంలో విజయ శంకర్ జట్టులోకి వచ్చాడు.. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లో రెండు మార్పులు చేశారు.. టిమ్ సౌథీ స్థానంలో ఫెర్గుసన్, మన్ దీప్ ప్లేస్ లో జగదీశన్ వచ్చాడు..గుజరాత్ జట్టు: వృద్ధిమాన్ సహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, , డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జోషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, విజయ్ శంకర్..
కోల్ కతా నైట్ రైడర్స్ – నితీష్ రానా,ఫెర్గుసన్, జగదీశన్, రెహముల్లా గుర్భాజ్, రింకూ సింగ్, అండ్రూ రసెల్,సునీల్ నారాయణ్, శార్ధూల్ ఠాకూర్, సుషేయే శర్మ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి