లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చితక్కొట్టింది. ఓపెనింగ్ జోడీ అయిన రుతురాజ్ గైక్వాడ్, కాన్వే కలిసి పటిష్టమైన భాగస్వామ్యం నిర్మించారు. 14 ఓవర్లలో 150 పరుగులు దాటి పోవడంతో ఇక వెనుతిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది అయితే.. గైక్వాడ్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాన్వే 47 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో శివం దూబే (27), మొయిన్ అలీ (16), పరుగులు చేశారు.
ఇక.. మిగతా వారు పెద్దగా ఆటతీరు కనబర్చలేదు. అయితే చివరలో వచ్చిన కెప్టెన్ ధోనీ సిక్స్‌లతో అభిమానులకు కనువిందు చేశాడు. రెండు బాల్స్‌ని సిక్స్‌లుగా మలిచిన ధోనీ, మూడో బాల్కి క్యాచ్ అవుటయ్యాడు. అప్పటికే చెన్నై ఈ సీజన్లో ఇప్పటి వరకూ ఏ జట్టు చేయని 217 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఇక చివర్లో అంబటి రాయుడు 27, శాంత్నర్ 1 కలిసి ఆట ముగించారు. కాగా ఈ మొత్తం స్కోరు ఐపీఎల్ 16 సీజన్లో ఇదే టాప్ స్కోరుగా నిలిచింది. ఇక.. 218 పరుగుల టార్గెట్‌తో లక్నో బ్యాటింగ్‌కు దిగింది.