జట్టులోని ఆటగాళ్లందరూ.. బాధ్యతగా ఉండి.. మ్యాచ్‌లో గెలిచేందుకు కృషి చేయాలని, ఒక్కరి పైనే ఆధారపడి ఉండకూదని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు సారథిగా.. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. ఒకరు ధాటిగా ఆడుతున్న సమయంలో.. మరొకరు అతనికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉంటుందన్నారు. పరిస్థితులను బట్టి ఆటతీరును మార్చుకోవాల్సి ఉంటుందని హితవు పలికారు. డిఫెన్స్ ఆడే ఆటగాడు కూడా.. భారీ షాట్లు బాదాల్సి వస్తుందని, అందుకే పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ శైలి మార్చుకోవాలని సూచించారు. చాలా కాలంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నట్టు చెప్పిన శ్రేయస్.. ఏ స్థానంలో అయినా ఆడేందుకు సిద్ధమే అన్నాడు.
వ్యక్తిగతంగా తనకు మూడో స్థానం నచ్చుతుందని, అందుకే తన స్థానం నెంబర్ 3గా భావిస్తానని చెప్పుకొచ్చాడు. కేకేఆర్ జట్టులోని ప్రతీ ఆటగాడు ఎంతో మెరుగైన ప్రతిభ ఉన్నవారే అని, దూకుడుగా వ్యవహరించే తీరు.. ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడటంలో దోహదం చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. బ్యాటర్‌గా, జట్టు కెప్టెన్‌గా.. ఆడుతానని తెలిపాడు. కలిసికట్టుగానే విజయాలు సాధిస్తామని, ఈసారి కేకేఆర్ జట్టు మెరుగైన ప్రతిభ కనబరుస్తుందన్నాడు. మెగా వేలంలో.. కేకేఆర్ జట్టు.. శ్రేయస్ అయ్యర్‌ను రూ.12.50 కోట్లకు సొంతం చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..