Friday, November 22, 2024

Critcisms : ఆర్సీబి ప్ర‌ద‌ర్శ‌న‌పై గ‌రం..గ‌రం

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో చెత్త ప్రదర్శనలతో మరోసారి తమ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు నిండా స్టార్‌ ఆటగాళ్లు ఉన్నా సరైన సమయంలో వారు రాణించకపోవడంపై ఇటు అభిమానులు.. అటు మాజీలు తీవ్ర స్థాయిలో మండి పడు తున్నారు. ఎప్పటిలాగే విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ ఆర్‌సీబీని ముందుకు లాకెళ్లుతున్నాడు.

కానీ ఇతర బ్యా టర్ల నుంచి అతనికి ఎలాంటి సహకారం లభించడంలేదు. ఇక అప్పుడప్పుడు కార్తిక్‌, డుప్లెసిస్‌ రాణిస్తున్నా తమ జట్టును గెలిపించడంలో మాత్రం వీరుకూడా విఫలమవుతున్నారు. ఇక మొత్తంగా బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్‌ లో మాత్రం పూర్తిగా తేలిపోతుంది. భారీగా పరుగులు సమ ర్పించుకోవడం బెంగళూరు జట్టుకు అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది.

- Advertisement -

సోమవారం సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరా బాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్లు మరి దారుణంగా బౌలింగ్‌ చేశారు. గల్లి క్రికెట్‌ మాదిరిగా భారీగా పరుగులు సమ ర్పించుకున్నారు. ఏకంగా నలుగురు బౌలర్లు 50పైగా పరు గులు సమర్పించుకొని చెత్త రికార్డును మూట గట్టుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు పరుగుల సునామీని తలపిస్తూ ఏకంగా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికంగా 287 పరుగులు సాధించారు. జట్టు లో చాలా మంది స్టార్‌ బౌలర్లు ఉన్నా ఏ ఒకరు కూడా సన్‌రైజ ర్స్‌ బ్యాటర్లను కట్టిడి చేయలేక పోవడం ఆశ్యర్య పరిచింది. మొ త్తంగా ఈ సీజన్‌లో పూర్తిగా తేలిపోయిన బెంగళూరు టీమ్‌ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఏకంగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టి కలో చివరి స్థానంలో నిలిచింది.

టోర్నీ ఆరంభానికి ముందు ఎలాగైన ఈసారి ఐపీఎల్‌ ట్రోఫీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆర్‌సీబీ ఇప్పుడు కనీసం నాకౌట్‌ చేరడం కూడా కష్టమ నిపిస్తోంది. అందుకే ఇప్పుడు బెంగళూరు ఫ్యాన్స్‌.. జట్టు ఆట గాళ్లతో పాటు ఆర్‌సీబీ యాజమాన్యంపై గుర్రున ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా వారిపై ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ నెపథ్యంలో టెన్నిస్‌ దిగ్గజం మహేష్‌ భూపతి సైతం ఆర్‌సీబీ ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండి పడ్డాడు. క్రికెట్‌ ప్రేమికులు, ఐపీఎల్‌ అభిమానుల, ఆటగాళ్ల కోసమైన ఆర్‌సీబీ మొత్తం జట్టును అమ్మేయాలని బీసీసీఐని సూచించాడు. ఆర్‌ సీబీ తాజా ప్రదర్శన చాలా నిరాశజనకంగా ఉంది, కొత్త యజ మానులు వస్తే ఆటగాళ్ల తల రాతైన మారుతుందేమోనని అన్నాడు. స్పోర్ట్స్‌ ఫ్రాంచైజీ నిర్మాణంపై శ్రద్ధ చూపే కొత్త యాజమాన్యానికి ఆ జట్టుని అప్పగిస్తే బాగుంటుందని భూపతి పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement