ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం జరగనున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సంచలన విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 5 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఇదే జోరును కొనసాగించాలని ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. మరోవైపు 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తేలిపోతున్న ఆ జట్టు బౌన్స్ బ్యాక్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. సొంత అభిమానుల మధ్య సన్‌రైజర్స్‌ను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది.
తెలుగోడికి ప్రమోషన్..
ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంజాబ్ కింగ్స్‌తో తమ కాంబినేషన్లో పలు మార్పులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ కాంబినేషన్నే కొనసాగించనుంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వడం.. స్టార్ ఆటగాళ్లంతా విఫలమైన వేళ అతను అసాధారణ హాఫ్ సెంచరీతో చెలరేగడం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చింది. అతన్ని అదే స్థానంలో ఆడించే అవకాశం ఉంది.
సుందర్‌కు అవకాశం..
అయితే బెంగళూరు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు పేసర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సన్‌రైజర్స్ తమ స్పిన్నర్‌ను మార్చే అవకాశం ఉంది. మయాంక్ మార్కండే స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్, నటరాజన్‌ల్లో ఒక్కరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నారు.
మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రీచ్ క్లాసెన్ ఓవర్సీస్ ఆటగాళ్లకు బరిలోకి దిగనున్నారు. దాంతో గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్‌లకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
ముఖా ముఖి పోరు..
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు జరగ్గా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12, బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గత 5 మ్యాచ్‌ల్లో మాత్రం బెంగళూరు మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం. మరోవైపు టాస్ గెలిచి జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. డ్యూ ప్రభావం ఉండనున్న నేపథ్యంలో చేజింగ్ టీమ్‌కు కలిసి రానుంది.
మరోవైపు ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 54 శాతం గెలిచే అవకాశం ఉండగా, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 46 శాతం గెలిచే ఛాన్స్ ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ప్రాబబుల్ ప్లేయర్స్ ఫాఫ్ డు ప్లెసిస్ , విరాట్ కోహ్లి, విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ , మహిపాల్ లోమ్రోర్, రీస్ టాప్లీ, విజయ్ కుమార్ వైశాఖ్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రాబబుల్ ప్లేయర్స్ పాట్ కమిన్స్ , ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, షాబాజ్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్ , అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, మయాంక్ మార్కండే