Sunday, November 10, 2024

IPL : నేడు ల‌క్నో సూప‌ర్ తో ఆర్సీబి ఢీ…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ లో నేడు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో లక్నో సూపర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ ఐపిఎల్ ఆర్సీబి కి ఇది నాల్గవ మ్యాచ్.ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరోవైపు లక్నో రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో చేరాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

- Advertisement -

కాగా, . విధివైచిత్రి అంటే ఇదే అనుకుంటాను. టీమ్ ఇండియాలో సూపర్ ప్లేయర్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలు ఆడుతున్న జట్లు ఇలా 9, 10 స్థానాల్లో ఉండటంపై అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరిగాయి. ఆ రెండింటిలో ఆర్సీబీ విజయం సాధించింది. నేటి మ్యాచ్‌లో చూస్తే ఆర్సీబీ వర్సెస్ లక్నో ఇరు జట్లూ సమానంగా కనిపిస్తున్నాయి. అటు బ్యాటింగ్, ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌లో సమతూకంగా ఉన్నాయి. కానీ ఆర్సీబీలో విరాట్ ఒక్కడే బ్యాటింగ్ లో ఆడి, ఒంటరిపోరాటం చేస్తున్నాడు. తనకి మిగిలినవాళ్లు సహకరిస్తే, ఈరోజు మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. ఆర్సీబి బౌలింగ్ పరంగా చాలా పేలవంగా ఉంది. అందువల్ల నేటి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు ఉండొచ్చు. బెంగళూరులోని బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ల స్వభావాన్ని బట్టి, ఆర్సీబికి బలమైన, అనుభవజ్ఞుడైన బౌలర్ అవసరం.
వెస్టిండీస్‌కు చెందిన సీమర్ అల్జారీ జోసెఫ్ గత మూడు మ్యాచ్‌ల్లో ఖరీదైన ఆటగాడిగా మారాడు. జోసెఫ్ పేలవమైన ప్రదర్శన అతనిని తప్పించవచ్చు. అతని స్థానంలో స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దాదాపుగా బరిలోకి దిగడం ఖాయం. అవకాశం కోసం ఎదురుచూసే ఆటగాళ్లు ఈరోజు బరిలోకి దిగవచ్చు. ఆర్‌సీబీ జట్టు బ్యాటింగ్ విభాగంలో కూడా మార్పు రావాల్సి ఉంది. గత ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నుంచి పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రజత్ పాటిదార్‌కు నేడు అవకాశం దక్కడం అనుమానమే. అతని స్థానంలో సుయేష్ ప్రభుదేశాయ్ లేదా మహిపాల్ లుమ్రూర్ వచ్చే అవకాశం ఉంది.

టీమ్‌లో ఆల్‌రౌండర్ల పరంగా చూస్తే ఆర్‌సీబీ దగ్గర షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్ వంటి, మేటి ఆల్ రౌండర్లు ఉన్నారు. అలాగే వనిందు హసరంగా, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ వంటి బౌలర్లు మంచి స్వింగ్ లో ఉన్నారు. మరోవైపు, లక్నోలో చూస్తే కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, కైల్ మేయర్స్ ఆల్ రౌండర్ల పాత్రలో ఉన్నారు. సిద్ధార్థ్, నవీన్ ఉల్ హక్, మోషిన్ ఖాన్, రవిబిష్ణోయ్ వీరు మంచి బౌలింగ్ తోనే ఉన్నారు.

రెండు జట్లలో వీరు ఆడవచ్చు:
లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మైయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్/క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్/అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, అవేశ్ ఖాన్/జయ్‌దేవ్ ఉనద్కత్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement