ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై నమోదైన అత్యాచారం కేసు అమెరికా కోర్టు కొట్టివేసింది. సరైన సాక్ష్యాధారాలు సేకరించి, నిరూపించడంలో ప్రతివాదులు విఫలమయ్యారని పేర్కొంటూ కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2009లో లాస్ వెగాస్‌లోని ఒక హోటల్‌లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో కేసు వేసింది.
దీనిపై కొన్నేళ్లుగా సుదీర్ఘ విచారణ జరిపిన లాస్ వెగాస్ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని 42 పేజీల తీర్పులో పేర్కొంది. అదే క్రమంలో రొనాల్డో అత్యాచార కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.