బీసీసీఐ సవరించిన షెడ్యూల్ ప్రకారం రంజీట్రోఫీ లీగ్ దశ ఫిబ్రవరి 16నుంచి మార్చి 5వరకు జరగనుంది. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని జనవరిలో ప్రారంభం కావాల్సిన రంజీట్రోఫీని బీసీసీఐ వాయిదా వేసింది. కొవిడ్ కేసులు ఉద్ధృతి తగ్గడంతో దేశీయ టోర్నమెంట్‌ను ప్రారంభించాలని బీసీసీఐ భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
38జట్లు పాల్గొనే ఈవెంట్‌కు అహ్మదాబాద్, కోల్‌కతా, త్రివేండ్రం, కటక్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, రాజ్‌కోట్ వేదికలు కానున్నాయి. ఆరుజట్లుతో కూడిన ప్లేట్ గ్రూప్‌తోపాటు నాలుగు జట్లుతో కూడిన ఎనిమిది గ్రూప్‌లు పోటీపడతాయి. జూన్ నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా 2020లో రంజీట్రోఫీ ఫైనల్ తర్వాత భారత్‌లో రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీలను నిర్వహించలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..