Saturday, November 23, 2024

Breaking: రాజ్‌కోట్ వేదిక‌గా నాలుగో టీ20.. ఇండియాదే ఫ‌స్ట్ బ్యాటింగ్‌

సౌతాఫ్రికాతో ఇవ్వాల నాలుగో టీ20 జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్ప‌టికే మూడు మ్యాచ్‌లు అయిపోయాయి. దీంట్లో రెండు మ్యాచ్‌లు సౌథాఫ్రికా, ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది. కాగా, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌ రిషభ్ పంత్ అంత‌గా రాణించడం లేదు. ఈ విషయంపై పలువురు దిగ్గజాలు ప్రశ్నలు లేవనెత్తారు. మరింత కాలం పంత్ రాణించకపోతే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా ఇవ్వాల (శుక్ర‌వారం) జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ సన్నాహకాల్లో పంత్ తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ దగ్గరుండి పంత్‌కు కొన్ని సలహాలు ఇస్తూ కనిపించాడు. అనంతరం తను నేర్చుకున్న విషయాలను బ్యాటింగ్‌లో రిఫ్లెక్ట్ చేయడానికి పంత్ ప్రయత్నించాడు.

మిగతా ఆటగాళ్లు కూడా పూర్తి పాజిటివ్ దృక్పథంతో కనిపించారు. ఐపీఎల్ నుంచి బ్యాటింగ్‌లో తడబడుతున్న పంత్.. తన ఫామ్‌ లేమిని సౌతాఫ్రికా టూర్‌లో కూడా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement