టాటా ఐపీఎల్ 2022లో భాగంగా ఇవ్వాల జరుగుతున్న 34వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేసింది. రెండో ఇన్సింగ్స్లో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది..
ఇంకా 66 బంతుల్లో 128 పరుగులు చేయాల్సి ఉంది. ఎంత దీటుగా ఆడినా రాజస్థాన్ పెట్టిన టార్గెట్ను ఛేదించడం కష్టమే అని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.
మరి టీ20లో ఏదైనా సాధ్యమే అని మరికొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఏదైనా మ్యాజిక్ జరిగేనా, ఢిల్లీ గట్టెక్కేనా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైతే (9 ఓవర్లకు) డేవిడ్ వార్నర్ 28, సర్ఫరాజ్ ఖాన్ 1 పరుగు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజ్లో పృధ్వీషా 35, రిషబ్ పంత్ 22 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.