Home క్రీడాప్రభ IND Vs AUS | తొలిరోజు వ‌ర్షార్ప‌ణం… రేపు అరగంట ముందే మ్యాచ్!

IND Vs AUS | తొలిరోజు వ‌ర్షార్ప‌ణం… రేపు అరగంట ముందే మ్యాచ్!

0
IND Vs AUS | తొలిరోజు వ‌ర్షార్ప‌ణం… రేపు అరగంట ముందే మ్యాచ్!

బోర్డర్-గవాస్కర్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రారంభ‌మైన‌ కీలకమైన మూడో టెస్ట్‌ వ‌ర్షార్ప‌ణం అయ్యింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే మ్యాచ్ మొద‌లైన‌ 5.3 ఓవర్లకే వర్షం కారణంగా దాదాపు అరగంట పాటు మ్యాచ్ నిలిచిపోయింది.

13.2 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం మొదలైంది… ఇక ఎంత‌కూ వర్షం తగ్గుముఖం ప‌ట్ట‌క‌పొవ‌డంతో ఆటను నిలిపివేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. కాగా, 13.2 ఓవర్లలో ఆసీస్ జ‌ట్టు 28 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (19) నాథన్ మెక్‌స్వీనీ (4)తో నాటౌట్‌గా నిలిచాడు.

వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దు కావడంతో.. రెండో రోజు మ్యాచ్‌లో 98 ఓవర్లు ఆడనున్నారు. దీంతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే అరగంట ముందుగా అంటే ఉదయం 5.20 గంటలకు ప్రారంభమవుతుంది.

Exit mobile version