లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో ఎలిమినే టర్ మ్యాచ్‌లో 58 బంతుల్లో 79పరుగులు చేశాక రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 616 పరుగులు చేసి టాప్ బ్యాట్స్‌మెన్స్‌లో ఒకడిగా నిలిచాడు. ఈ సీజన్లో రెండు సెంచరీ లు, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ తొలి ఐపీఎల్ సీజన్లోనే ప్లేఆఫ్స్‌కు చేరుకునేలా చేయడంలో కేఎల్ రాహుల్ విజయవంతమయ్యాడు. ఐపీఎల్లో నిలకడైన ఆటతీరు ప్రదర్శించే ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటాడు కేఎల్ రాహుల్. ప్రతి సీజన్లో పరుగుల వేటలో నేనున్నా అంటూ కేఎల్ రాహుల్ విధ్వంసం కొన సాగిస్తున్నాడు. కానీ ఏం ప్రయోజనం తన జట్టును మాత్రం ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నాడు.
2021లో పంజాబ్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 626 పరుగులు చేశాడు. 2020 సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడి 670 పరుగులు, 2018లో 659 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్లో నాలుగుసార్లు 600పైబడి పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా అవతరించాడు. రాహుల్ తర్వాతి స్థానంలో క్రిస్‌గేల్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. వీరిద్దరు మూడు ఐపీఎల్ సీజన్లలో 600కు పైగా పరుగులు చేశారు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్‌గేల్ ఆర్సీబీ తరఫున ఆడినప్పుడు 2011, 2012, 2013 సీజనల్లో వరుసగా 600కుపైగా పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సన్‌రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ప్పుడు 2016, 2017, 2019 సీజన్లలో 600కుపైగా పరుగులు చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..