టీమిండియాతో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంకతో విజయం సాధించిన విషయం తెలిసిందే..దీంతో సిరీస్ 1-1 తో సమం అయింది. అయితే మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ విరామం సమయంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ 12వ ఆటగాడైన సందీప్ వారియర్‌కు చిట్టీని ఇచ్చి గ్రౌండ్‌కు పంపించడం ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు బెయిల్స్ తీసి మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. గ్రౌండ్‌మెన్లు కూడా పిచ్‌పై కవర్ కప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ సూచనలు చేసిన ఒక చిట్టీని సందీప్ వారియర్ చేతిలో పెట్టాడు. అతను దాన్ని తీసుకొని గ్రౌండ్లోకి వెళ్లి శిఖర్ ధావన్‌కు అందించాడు. ఆ చిట్టీలో ద్రవిడ్ ఏం పంపాడనేది ఆసక్తి కలిగించింది. వాస్తవానికి ఆ చిట్టీలో డక్‌వర్త్ లూయిస్ గురించి రాసినట్లు సమాచారం. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ జరిగే అవకాశముందని భావించిన ద్రవిడ్ దానికి తగ్గ ప్రణాళికలు చిట్టీలో రాసి పంపించినట్లు తెలిసింది. అయితే కాసేపటికే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించగా.. లంక లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకుంది. కాగా ఈ రోజు సిరీస్ విజేతను నిర్ణయించే మూడవ మ్యాచ్ జరగనుంది. కొత్త కుర్రాళ్లతో టీమిండియా కాస్త తబడినప్పటికి శ్రీలంక కు గట్టిపోటీ ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి : అమెరికాలో మరోసారి భారీగా పెరుగుతున్న కరోనా కేసులు