యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ప్రపంచ రెండవ ర్యాంకర్ స్పెయిన్‌బుల్ రాఫెల్ నాదల్ ప్రస్తానం ముగిసింది. మంగళవారం జరిగిన నాలుగవ రౌండ్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన 22వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో చేతిల4 6-4, 4-6, 6-4, 6-3తో చిత్తుగా ఓడాడు. ఈ ఏడాది మేజర్ టోర్నీల్లో నాదల్కు ఎదురైన తొలి ఓటమి ఇదే. 23వ గ్రాండ్‌స్లామ్ కోసం ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కిక్కిరిసిన ఆర్దర్ ఆషే స్టేడియంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో నాదల్ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. తొలిసెట్లో తడబడిన నాదల్ , పంజుకుని రెండవ సెట్‌ను గెలుచుకున్నాడు. కానీ తర్వాత వరుస సెట్లను కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకున్నాడు.
ఐదోసారి నాదల్ సర్వీస్‌ను బ్రేక్‌చేస్తూ విజయం సాధించిన టియఫో, తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సాధించాడు.క్వార్టర్స్‌లోకి చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ డానిల్ మెద్వెదెవ్ ఇప్పటికే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రిక్వార్టర్స్‌లోనే ఇద్దరు టాప్ సీడ్ ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో టైటిల్ రేసునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా గ్రాండ్‌స్లామ్‌లలో నాదల్‌ను ఓడించిన మూడవ అమెరికా ఆటగాడిగా టియఫో చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఆండీ రాడిక్, జేమ్స్ బ్లేక్ మాత్రమే రాఫెల్‌కు చెక్ పెట్టగలిగారు.