Tuesday, December 24, 2024

Pv sindhu | ఉదయపూర్‌లో ఘనంగా పీవీ సింధు పెళ్లి.. ఫోటోలు వైరల్ !

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు పెళ్లి ఆదివారం జైపూర్‌లో ఘనంగా జరిగింది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయి, సింధు ఏడు అడుగుల వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఆదివారం అర్ధ రాత్రి రఫల్స్‌ హోటల్లో సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.

అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో సింధు పెళ్లి జరిగిందని సమాచారం. అయితే వీరి పెళ్లి ఫోటోలను ఇరువైపుల కుంటుంబ సభ్యులు విడుదల చేయలేదు. ఈ వేడుక‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరయ్యారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

- Advertisement -

రేపు హైద‌రాబాద్ లో రిపెప్ష‌న్..

పీవీ సింధు పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం హల్ది సంబరాలు ఘనంగా జరిపారు.. తర్వాత శనివారం మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆదివారం రోజు కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో సింధు, వెంకట సాయి వివాహం గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రఫల్స్‌ హోటల్లో పెళ్లి వేదికను అలంకరించారు. దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి వచ్చిన అతిథులకు రాజస్థాన్‌ ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. కాగా, మంగళవారం డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో సింధు-వెంకట సాయి రిసెప్షన్‌ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement