రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పెళ్లి పీటలపైకి ఎక్కనుంది. ఆమె ఈ 22న ఉదయపూర్‌లో వివాహం చేసుకోనున్నారు. హైదరాబాద్ మహా నగరానికి చెందిన ఓ ప్రముఖ బిజినెస్ మాన్ ను వివాహం చేసుకోబోతున్నారు పీవీ సింధు.
హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మాన్ వెంకట దత్త సాయి ని పెళ్లి చేసుకోనుంది. వెంకట దత్త సాయి వ్యాపారవేత్తనే కాదు…పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ మేరకు ఇరు కుటుంబాల మధ్య అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. కానీ వాటిని సీక్రెట్ గా నిర్వహించారు.
ఇక ఈ నెల 22వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో పీవీ సింధు పెళ్లి జరుగనుంది. ఈ నెల 24 వ తేదీన హైదరాబాద్ రిసెస్ఫన్ ఉందట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పీవీ సింధు కుటుంబ సభ్యులు. పీవీ సింధు పెళ్లి ) కొంత మంది బందు, మిత్రుల సమక్షలంలో నిర్వహించనున్నారు . ఈ మేరకు వివరాలను సింధూ తల్లిదండ్రులు వెల్లడించారు.