టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ సీ మ్యాచ్‌లో వెస్టిండీస్ 104 రన్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించింది. రెండు జట్లూ ఇప్పటికే సూపర్-8 స్టేజ్‌కు వెళ్లినా.. చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం వెస్టిండీస్ తన సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్లు దుమ్మురేపారు. భారీ షాట్లతో అలరించారు.
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ పెను విధ్వంసం సృష్టించాడు . అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 98 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పూరన్ విధ్వంసంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 రన్స్ చేసింది. టీ20 ప్రపంచకప్ 2024లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7) నిరాశారిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (43)కు నికోలస్ పూరన్ తోడవ్వడంతో విండీస్ స్కోర్ పరుగులు పెట్టింది. హాఫ్ సెంచరీ ముందు చార్లెస్ పెవిలియన్ చేరినా.. 31 బంతుల్లో పూరన్ అర్ధ శతకం చేశాడు.
ఇనింగ్స్ చివరలో పూరన్ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. రషీద్ ఖాన్ వేసిన 18 ఓవర్లో ఏకంగా 24 రన్స్ బాదాడు. అయితే చివరి ఓవర్లో రెండు సిక్సులు బాదిన పూరన్.. అనూహ్యంగా రనౌట్ అయి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. హోప్ (25), పావెల్ (26) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు తీశాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ ఓడిపోయింది. భారీ స్కోర్‌ను చేధించలేకపోయింది. ఇబ్రహీం జద్రాన్ (38) టాప్ స్కోరర్. ఒబెడ్ మెక్కాయ్ మూడు వికెట్స్ తీశాడు. ఇక బ్యాటింగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తడబడింది. 16.2 ఓవర్లలో ఆ జట్టు కేవలం 114 రన్స్‌కే ఆలౌటైంది. ఈ గెలుపుతో గ్రూప్ సీలో విండీస్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.
ఒకే ఓవర్‌లో 36 పరుగులు..
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 53 బంతుల్లో 98 పరుగులు బాదాడు. ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో హోరెత్తించాడు. అయితే ఈ క్రమంలో పూరన్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 36 పరుగులు రాబట్టుకున్నాడు.
నాలుగో ఓవర్ వేసిన అజ్మతుల్లాకు పూరన్ సిక్సర్‌తో స్వాగతం పలికాడు. రెండో బంతిని ఫోర్ బాదాడు. అయితే అది నోబాల్. ఒత్తిడికి లోనైన అజ్ముతుల్లా ఫ్రీహిట్‌ను భారీ వైడ్‌గా వేయడంతో అది బౌండరీకి చేరి అదనంగా అయిదు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన ఫ్రీహిట్ బాల్‌కు పరుగులేమి రానప్పటికీ అనంతరం పూరన్ బౌండరీల వర్షం కురిపించాడు. మూడో బంతి లెగ్‌బై రూపంలో బౌండరీ లభించింది. నాలుగొ బంతిని పాయింట్ మీదుగా ఫోర్ సాధించాడు. అయిదో బంతిని 89 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. ఇక ఆఖరి బంతిని కూడా లాంగాఫ్ మీదుగా సిక్సర్ బాదడంతో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. దీంతో అరుదైన జాబితాలో పూరన్ చోటు సంపాదించాడు.
ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా హేమాహేమీల సరసన పూరన్ నిలిచాడు. టీ20ల్లో ఓ ఓవర్‌లో 36 పరుగులే అత్యధికం. దీన్ని ఇప్పటివరకు కొందరు ఒంటిచేత్తో, మరికొందరు పార్టనర్‌తో సాధించారు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ (స్టువర్ట్ బ్రాడ్-2007), కీరన్ పొలార్డ్ (ధనంజయ-2007), రోహిత్ శర్మ & రింకూ సింగ్ (కరీమ్ జనత్-2024), దీపేంద్ర సింగ్ (కమ్రాన్ ఖాన్-2024), పూరన్ & చార్లెస్ (అజ్మతుల్లా ఒమర్జాయ్- 2024) ఉన్నారు.