కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ పై 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆట చివరలో వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిన రిజల్ట్ ప్రకటించారు. వర్షం పడే సమయానికి కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 146 రన్స్ చేసింది. డీఎల్‌ఎస్ ప్రకారం ఆజట్టు 16 ఓవర్లకు 153 స్కోర్ చేయాలి. కానీ, 7 పరుగులు వెనకబడి ఉంది. వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు.
రాజపక్సే హాఫ్ సెంచరీ
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 191 పరుగులు చేసింది. భానుక రాజపక్సే (50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శిఖర్ ధావన్(40), ఓపెనర్ ప్రభ్‌సింహ్ రానా సింగ్ (23) వికెట్ కీపర్ జితేశ్ శర్మ(21), సికిందర్ రజా (16) రాణించారు. ఆఖర్లో ఆల్‌రౌండర్ సామ్ కరన్(26), షారుఖ్ ఖాన్(11) దంచి కొట్టడంతో పంజాబ్ 191 రన్స్ చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ రెండో వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అర్ష్‌దీప్ దెబ్బకు..
అర్ష్‌దీప్ సింగ్ దెబ్బకు కేకేఆర్ ఓకే ఓవర్‌లో రెండో వికెట్లు కోల్పోయింది. అనుకుల్ రాయ్ (4), మన్‌దీప్ సింగ్ (2) ఔటయ్యారు. ఆ తర్వాత నితీశ్ రానా, గుర్బాజ్ తక్కువకే ఔటయ్యారు. 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ను అండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ అదుకున్నారు. వీళ్లు వీళ్లు ఆరో వికెట్‌కు 50 రన్స్ జోడించారు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, నరైన్ వేగంగా ఆడారు. కానీ, వర్షం పడడంతో మ్యాచ్ కోల్‌కతా చేజారింది.