ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శనివారం నాడు మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్, ఐదు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ ఐదు మ్యాచ్ లలో కేవలం ఒకదానిలో మాత్రమే ఓడి పాయింట్స్ టేబుల్ లో నంబర్ 1 స్థానంలో నిలిచింది.
ఇక ఈ రెండు జట్లు పంజాబ్, రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు 26 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ వాటిలో 11 మ్యాచ్ లు, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్ లు గెలిచింది. ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఇప్పటివరకు పంజాబ్ అత్యధికంగా 223 పరుగులు చేయగా, పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ అత్యధిక స్కోరు 226. ఇక వీరిద్దరి మధ్య గత ఐదు మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ రెండు విజయాలు సాధించింది.
ఇక మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలోని మొహాలీ పిచ్ భారతదేశపు అత్యంత వేగవంతమైన వాటిలో ఒకటి. పిచ్ పై పేసర్లకు అదనపు బౌన్స్ అందిస్తుంది. ముఖ్యంగా కొత్త బంతితో బ్యాటర్లు ఇక్కడ పడాల్సి ఉంటుంది. ఇక రాత్రి మంచు ఆటను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ సాధారణంగా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాడు.
ఇక నేటి మ్యాచ్ లో ఆటగాళ్ల విషయానికి వస్తే..
పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ (c), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, సికందర్ రజా, జితేష్ శర్మ (WK), అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రభ్సిమ్రాన్ సింగ్ ఉండవచ్చు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ లు ఉండగా ఇంపాక్ట్ ప్లేయర్ గా కుల్దీప్ సేన్ ఉండొచ్చు.