టాటా ఐపీఎల్ 2022లో భాగంగా ఇవ్వాల లక్నోతో జరుగుతున్న 42వ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మన్ తడబాటుకు గురవుతున్నారు. మయాంక్ అగర్వాల్ (25), శిఖర్ ధవన్ (7) తర్వాత కీలకమైన రాజపక్స (9) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపు మెరుపులు మెరిపించిన లివింగ్‌స్టన్ (18) కూడా పదమూడో ఓవర్లో అవుటయ్యాడు. ఆ ఓవర్ తొలి బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించిన లివింగ్‌స్టన్.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో క్రిజులోకి వచ్చిన జితేష్ శర్మ (2) కూడా ఎక్కువ సేపు నిలవలేదు.
పంజాబ్ స్కోరు: 17 ఓవర్లకు 112/6..
ఇక కృనాల్ పాండ్యా వేసిన 14వ ఓవర్ రెండో బంతిని డిఫెండ్ చేసుకోవడానికి జితేష్ ప్రయత్నించాడు. అయితే బంతి అతని ప్యాడ్లను తాకడంతో లక్నో జట్టు అప్పీల్ చేసింది. బంతి ముందుగా ప్యాడ్‌ను తాకిందా? లేక బ్యాట్‌ను తాకిందే తెలియకపోవడంతో అంపైర్ స్పందించలేదు. దీంతో లక్నో కెప్టెన్ రాహుల్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి ముందుగా ప్యాడ్‌నే తాకినట్లు తేలింది. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో జితేష్ కూడా పెవిలియన్ చేరాడు. కాగా, 32 పరుగులు చేసిన మాంచి జోష్‌మీదున్న జానీ బరిస్టో కూడా 103 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో 103 పరుగుల వద్ద పంజాబ్ కీలకమైన ఆరు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లోపడింది. ప్రస్తుతం క్రీజ్‌లో రిషీ ధవన్, రబాడా ఉన్నారు. పంజాబ్ ఆశలన్నీ వీరిద్దరి మీదనే ఉన్నాయి.