:ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో . పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది : ప్లే ఆఫ్స్ పోటీలో వెనకబడిన పంజాబ్ కింగ్స్ కీలక మ్యాచ్‌లో సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 31 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(103) శతకం బాదడంతో 167 రన్స్ కొట్టింది. లక్ష్య ఛేదనలో హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ స్పిన్ ధాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(54) తప్ప ఏ ఒక్కరూ కనీస పోరాటం చేయలేదు. నాథన్ ఎల్లిస్ వేసిన 20వ ఓవర్లో 5 పరుగుల వచ్చాయి. దాంతో, ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. కుల్దీప్ యాదవ్(10), ముకేశ్ కుమార్ (6) నాటౌట్‌గా నిలిచారు. ఆరో విజయంలో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరింధి.
ముందుగా ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముంపంజాబ్ కింగ్స్దు 168 పరుగల టార్గెట్ నిలిచింది ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ శతకం చేయడం విశేషం. ఇక శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్‌ల వికెట్లను ఇషాంత్ శర్మ పడగొట్టగా.. ధావన్ 7, లివింగ్‌స్టోన్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జితేష్ శర్మ (5) అవుటయ్యాడు. ప్రవీణ్ దూబే సామ్ కరన్ (20) వికెట్ తీశాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్‌లకు ఒక్కో వికెట్ దక్కింది