కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలిచింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (67), త్రిపాఠి (34), నితీశ్ రాణా (31) చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. అనంతరం 165 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన పంజాబ్… 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోమారు అదరగొట్టాడు. 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ ( 40) పరుగులు చేశాడు. షారూఖ్ ఖాన్ 22 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ మూడు వికెట్లు తీసుకోగా, రవి బిష్ణోయ్ రెండు, షమీ ఓ వికెట్ పడగొట్టారు. 67 పరుగులు చేసిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఐదు విజయాలు నమోదు చేసింది.
ఇది కూడా చదవండిః పంజాబ్ కి షాకిచ్చిన గెల్.. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..