ఐపీఎల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ ముందు 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా టార్గెట్ చేజింగ్‌కోసం రంగంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్ (11 – 8 బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్) రెండో ఓవర్ మూడో బంతికి అర్షదీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మాథ్యూ షార్ట్ చక్కని క్యాచ్‌తో జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపించాడు.
ఇక.. సంజు శాంసన్ (42), పడిక్కల్ (21), రియాన్ పరాగ్ (20), జాబ్ బట్లర్ (19) మినహా.. మిగతా వారు పెద్దగా ఆటతీరు ప్రదర్శించలేదు. చివర్లో హెట్మేయర్ (35), ధ్రువ్ 32 కలిసి స్కోరుబోర్డుని మెరుగుదిద్దేందుకు ట్రై చేసినా పంజాబ్ వారిని కుదురుకోనివ్వలేదు. ఆఖరి ఓవర్లో హెట్మేయర్ రన్ అవుటయ్యాడు. దీంతో టార్గెట్ ఛేదనలో రాజస్థాన్ ఓటమి తప్పలేదు. కాగా, 5 పరుగులు తేడాతో పంజాబ్ ఈ సీజన్లో రెండో విజయం సొంతం చేసుకుంది.