ఐపీఎల్లో భాగంగా ఇవ్వాల (బుధవారం) రాత్రి మొహాలీలోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. పాయింట్ల పట్టికలో ముంబై కంటే ఓ మెట్టు (ఆరో స్థానం) పైనున్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఏకంగా రెండో స్థానానికి ఎగబాకుతుంది. ముంబై మాత్రం ఒకటి రెండు స్థానాలు మాత్రమే మెరుగుపరుచుకోగలుగుతుంది. ఓడితే మాత్రం కిందికి దిగజారే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం.
ఇక.. బ్యాటింగ్‌లో పంజాబ్ కింగ్స్ దూకుడు పెంచింది. ఓపెనర్ ప్రభుసిమ్రన్‌సింగ్ (9), పెద్దగా ఆకట్టుకోలేకపోయినా శిఖర్ ధవన్ (30) దంచికొట్టాడు .. అదే దారిలో మ్యాథ్యూ (27) ఆడాడు.. ఇక మూడు వికెట్లు కోల్పోయినా లివింగ్‌స్టోన్ 82, జితేశ్ శర్మ 49 స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. దీంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 214 పరుగులు చేసింది. ఇక ముంబయి జట్టు 215 పరుగుల టార్గెట్‌తో చేజింగ్ చేయనుంది.