రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దూకుడుమీదుంది. ఈ మ్యాచ్ లో శిఖర్ ధవన్ దంచికొట్టాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఓపెనర్లు బాగా ఆడారు. ఇందులో ప్రభు సిమ్రన్ సింగ్ (60) పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో బానుక రాజపక్స (1), సికిందర్ రాజా (1), షారుక్‌ఖాన్ (11) పెద్దగా రాణించలేదు..
అయితే.. ఓపెనర్‌గా వచ్చిన శిఖర్ ధవన్ మాత్రం 86 పరుగులతో చివరిదాకా ఆడి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లలో పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ టార్గెట్ 198 పరుగులుగా ఉంది..