Tuesday, October 22, 2024

Ranji Trophy | పుజారా డబుల్‌ రికార్డు..

టీమిండియాలోకి పునరాగమనంపై కన్నేసిన పుజారా రంజీ మ్యాచ్‌లో చెలరేగాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అలుపెరగని ఈ నయావాల్‌ రికార్డులు బ్రేక్‌చేశాడు. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా, సోమవారం ఛత్తీస్‌గఢ్‌పై డబుల్‌ సెంచరీతో 18 ఫస్ట్‌ క్లాస్‌ డబుల్స్‌ పూర్తిచేశాడు. తద్వారా ఆల్‌టైమ్‌ జాబితాలో నాల్గవ స్థానంలోకి దూసుకెళ్లాడు.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ మార్క్‌ రాంప్రకాష్‌, హెర్‌బర్ట్‌ సట్‌క్లిఫ్‌ (17 డబుల్‌ సెంచరీలు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో పుజారా తర్వాత భరత్‌ తరఫున కేఎస్‌ రంజిత్‌సింగ్‌ (14) ఉన్నాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ సెంచరీలలో పుజారాకిది 66వది. రంజీల్లో 25వ సెంచరీ.

అదే సమయంలో 21000 ఫస్ట్‌ క్లాస్‌ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గవాస్కర్‌, సచిన్‌, ద్రవిడ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ భారత బ్యాటర్‌గా నిలిచాడు. అత్యధిక డబుల్‌ సెంచరీల రికార్డుల్లో బ్రాడ్‌మన్‌ (37), వ్యాలీ హమండ్‌ (36), పాస్టీ హెండ్రెన్‌ (22) పుజారా కంటే ముందున్నారు.

అయితే.. న్యూజిలాండ్‌తో చివరి రెండు టెస్టులకు సెలెక్టర్లు అదే స్క్వాడ్‌ను కొనసాగించడంతో పుజారాకు అకవాశం లేనట్టే అనిపిస్తోంది. ఒకవేళ పుణేలోనూ పరిస్థితులు అనుకూలించని పక్షంలో ఢిల్లిd టెస్టుకు, ఆపై ఆస్ట్రేలియా పర్యటనకు పుజారాను ఎంపికచేసే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement