Monday, September 16, 2024

Delhi | రెజ్లర్లకు తక్షణం భద్రత కల్పించండి..

భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గతేడాది ముగ్గురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. కానీ అధికార పార్టీకు చెందిన బ్రిజ్‌ భూషణ్‌పై ఎలాంటి కేసు నమోదు కాలేదు. దాంతో ఆగ్రాహానికి గురైన రెజ్లర్లు రోడ్లపై దిగి భారీ ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఆ నిరసనల్లో భారత స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా, సాక్షి మలిక్‌లు కూడా పాల్గొని ఢిల్లిలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్న చేశారు. అనంతరం బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఢిల్లి కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. అయితే అధికార పక్షం నేత అయిన భుషణ్‌ నుంచి తమకు హానీ ఉంటుందని చెప్పడంతో గతంలో ఫిర్యాదు చేసిన ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లి పోలీసులు భద్రత కల్పించారు.

కానీ ఇప్పుడు తాజాగా ఆ ఫిర్యాదుదారుల భద్రతను పోలీసులు ఉపసంహరించుకున్నారు. దాంతో ఈ విషయాన్ని వినేశ్‌ ఫొగట్‌, సాక్షి మలిక్‌ సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేశారు. బ్రిజ్‌ భూషణ్‌తో పోరాడుతున్న రెజ్లర్లకు భద్రత తొలిగించారని వినేశ్‌ తన పోస్టులో పేర్కొంది.

దాంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అడిషనల్‌ చీఫ్‌ జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ప్రియాంక రాజ్‌పూత్‌ ఢిల్లి పోలీసులపై ఫైర్‌ అయ్యారు. వెంటనే రెజ్లర్ల భద్రతను పునరుద్ధరించి, తక్షణమే భద్రత కల్పించాలని ఆదేశాలు జారి చేశారు.రెజ్లర్లకు తక్షణం భద్రత కల్పించండి.. ఢిల్లి కోర్టు ఆదేశం

భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గతేడాది ముగ్గురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. కానీ అధికార పార్టీకు చెందిన బ్రిజ్‌ భూషణ్‌పై ఎలాంటి కేసు నమోదు కాలేదు. దాంతో ఆగ్రాహానికి గురైన రెజ్లర్లు రోడ్లపై దిగి భారీ ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఆ నిరసనల్లో భారత స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా, సాక్షి మలిక్‌లు కూడా పాల్గొని ఢిల్లిలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్న చేశారు. అనంతరం బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఢిల్లి కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. అయితే అధికార పక్షం నేత అయిన భుషణ్‌ నుంచి తమకు హానీ ఉంటుందని చెప్పడంతో గతంలో ఫిర్యాదు చేసిన ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లి పోలీసులు భద్రత కల్పించారు.

కానీ ఇప్పుడు తాజాగా ఆ ఫిర్యాదుదారుల భద్రతను పోలీసులు ఉపసంహరించుకున్నారు. దాంతో ఈ విషయాన్ని వినేశ్‌ ఫొగట్‌, సాక్షి మలిక్‌ సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేశారు. బ్రిజ్‌ భూషణ్‌తో పోరాడుతున్న రెజ్లర్లకు భద్రత తొలిగించారని వినేశ్‌ తన పోస్టులో పేర్కొంది.

దాంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అడిషనల్‌ చీఫ్‌ జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ప్రియాంక రాజ్‌పూత్‌ ఢిల్లి పోలీసులపై ఫైర్‌ అయ్యారు. వెంటనే రెజ్లర్ల భద్రతను పునరుద్ధరించి, తక్షణమే భద్రత కల్పించాలని ఆదేశాలు జారి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement