ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్-9కు సంబంధించి ఆగస్టు 5, 6 తేదీల్లో ముంబైలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పీకేఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ వేలం బరిలో 500కు పైగా కబడ్డీ క్రీడాకారులుంటారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. యంగ్‌స్టర్స్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఖేల్ ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లోని టాప్-2 టీమ్స్‌కు చెందిన 24 మంది క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. క్రీడాకారుల వేలంలో స్వదేశీ, విదేశీ, న్యూ యంగ్ ప్లేయర్స్ (ఎన్‌వైపీ)లను ఏ, బీ, సీ మరియు డీ గ్రూపులు విభజించడం జరుగుతుందన్నారు.
ఆ తర్వాత ప్లేయర్స్‌ను ఆల్ రౌండర్స్, డిఫెండర్స్, రైడర్స్ తదితర ఉప విభాగాలు చేస్తామన్నారు. ఒక్కో కేటగిరికి ప్రాథమిక ధర నిర్ణయంచినట్లు వివరించారు. కేటగిరి-ఏ రూ.30 లక్షలు, కేటగిరి-బీ రూ.20 లక్షలు, కేటగిరి- సఈ రూ.10 లక్షలు, కేటగిరి-డి రూ.6 లక్షలు. ప్రతి సీజన్‌లో న్యూ టాలెంటెడ్ ప్లేయర్స్ వెలుగులోకి వస్తున్నారని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.