మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్‌లో టైటిల్ కోసం ఏండ్లుగా నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ గెలుపొందింది. నిరుడు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుగా ఓడించిన స్మృతి మంధాన సేన టైటిల్‌ను ముద్దాడింది. తొలిసారి విజేతగా నిలిచిన ఆర్సీబీకి రూ.6 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.
- Advertisement -
రన్నరప్ ఢిల్లీకి రూ. 3 కోట్లు దక్కాయి. మరో విశేషం ఏంటంటే.. ట్రోఫీతో పాటు ఐదు అవార్డులను బెంగళూరు అమ్మాయిలే గెలుచుకున్నారు. ఆరెంజ్ క్యాప్‌ను ఎలీసె పెర్రీ గెలుచుకోగా.. పర్పుల్ క్యాప్ విజేతగా శ్రేయాంక పాటిల్ నిలిచింది.
- ఆరెంజ్ క్యాప్ – ఎలీసె పెర్రీ (347 పరుగులు, ఆర్సీబీ) – రూ.5 లక్షలు.
- పర్పుల్ క్యాప్ – శ్రేయాంక పాటిల్ (13 వికెట్లు, ఆర్సీబీ) – రూ. 5 లక్షలు.
- ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – సోఫీ మొలినెక్స్ (ఆర్సీబీ) – రూ.2.5 లక్షలు.
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – శ్రేయాంక పాటిల్ (ఆర్సీబీ) – రూ. 5 లక్షలు.