టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన హాకీ ఇండియా గోల్‌కీపర్ శ్రీజేష్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. 2021కు సంబంధింఇచ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వెటరన్ ఇండియా హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని పొందిన రెండో హాకీ ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు 2020లో భారత మహిళా హాకీజట్టు కెప్టెన్ రాణిరాంపాల్ 2019లో మెరుగైన ప్రదర్శనతో వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్న తొలి ఇండియన్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా 33ఏళ్ల శ్రీజేష్ మాట్లాడుతూ ఈ అవార్డుకు నామినేట్ చేసినందుకు అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్)కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ అవార్డుకోసం శ్రీజేష్‌తోపాటు స్పెయిన్‌కు చెందిన అల్బెర్టో గెనెస్ లోపెజ్, ఇటలీకి చెందిన వుషు ప్లేయర్ మిచెల్ గియోర్డానో పోటీపడగా శ్రీజేష్ 1,27,647ఓట్లతో విజేతగా నిలిచాడు. కాగా శ్రీజేష్ భారత్ తరఫున 244 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..