కౌలాలంపూర్: భారత షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఇండోనేసియా ఓపెన్ టోర్నీలోనూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. మెన్స్ సింగిల్స్ విభాగంలో 16వ మ్యాచ్‌లో గురువారంనాడు ప్రత్యర్థి హాంకాంగ్ క్రీడాకారుడు, వరల్డ్ నంబర్ 12 లాంగ్ అంగుస్‌పై 21-11, 21-18 వరుస సెట్లలో వరల్డ్ నంబర్ 23 ప్రణయ్ విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారంనాడు రాస్మస్ జెమ్కే, బ్రిస్ లెవెర్డెజ్ మధ్య జరిగే పోరులో గెలిచిన వారితో ప్రణయ్ తలపడనున్నాడు.
ఇండోనేసియా ఓపెన్‌లో భారత షట్లర్లలో ప్రణయ్ ఒక్కడే రాణిస్తున్నాడు. తొలి రౌండ్‌లో 7వ సీడెడ్ లక్ష్యసేన్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి వైదొలగారు. చైనా క్రీడాకారిణి బింగోజివో చేతిలో పీవీ సింధు, ఫ్రెంచ్ క్రీడాకారుడు లెవెర్డెజ్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే.
మరో మ్యాచ్‌లో భారత షట్లర్లు సమీర్ వర్మ వరల్డ్ నంబర్ 5- మలేసియా క్రీడాకారుడు లీ జీ జియా చేతిలో 10-21, 13-21 తేడాతో ఓటమిని చవిచూశాడు. ఉమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కి రెడ్డి 16-21, 13-21 తేడాతో టాప్ సీడ్స్ చెన్ ఖింగ్ – జియా యీ ఫాన్ చేతిలో పరాజయం పాలయ్యారు. మెన్స్ డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల 19-21, 15-21 తేడాతో చైనా జోడీ లీయు చెన్- ఓయూ జూయాన్ యీ చేతిలో ఓటమిని చవిచూసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.