Saturday, November 23, 2024

Breaking: వెస్టిండీస్​తో టీమిండియా వన్డే మ్యాచ్​.. టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న పూరన్​

ఇవ్వాల టీమిండియా, వెస్టిండీస్​ జట్ల మధ్య వన్డే మ్యాచ్​ జరుగుతోంది. మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్​లు ఆడనున్నాయి ఈ రెండు జట్లు. కాగా, కెప్టెన్​ రోహిత్​తో పాటు పలవురు సీనియర్లకు రెస్ట్​ ఇవ్వడంతో కుర్రాళ్లకు చాన్స్​ దక్కింది. దీంతోపాటు శిఖర్​ ధవన్​ కెప్టెన్సీ అవకాశం వచ్చింది. కాగా, భారత్‌తో జరిగే మ్యాచ్‌ కోసం వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

కాగా, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ విజయం తర్వాత భారత జట్టు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇవ్వాల్టి (జులై 22) నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో హాట్​ ఫేవరేట్​గా నిలవనుంది. భారత క్రికెట్‌లోని సూపర్‌స్టార్లు – అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ , పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చింది టీమ్​ మేనేజ్​మెంట్​. ఇక.. ఈ వన్డే సిరీస్​లో వారికి రెస్ట్​ ఇవ్వడంతో యువకులు, ఇతర ప్లేయర్‌లకు ఆడేందుకు చాన్స్​ దక్కింది. 

కాగా, తన ఓపెనింగ్ పార్టనర్​ రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో శిఖర్ ధావన్ ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తన కెరీర్‌లో రెండోసారి కెప్టెన్​గా నాయకత్వం వహిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. T20, ODI సిరీస్‌లలో 2-1 తేడాతో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. మొత్తంగా 2022లో తమ తొమ్మిది ODIలలో ఐదు, 16 T20లలో 12 గెలిచారు. మరోవైపు, వెస్టిండీస్, 2022లో ఇప్పటివరకు తమ 15 ODIల్లో 11, 11 T20ల్లో ఐదు ఓడిపోయి వైట్-బాల్ క్రికెట్‌లో ఘోరమైన ఆటతీరును ప్రదర్శించింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement