రష్యా టెన్నిస్ దిగ్గజం నటేల జలమిడ్జే ఇప్పుడు వింబుల్డన్ టోర్నమెంట్ కోసం కసరత్తు ప్రారంభించింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్‌యంలో రష్యాను క్రీడా ప్రపంచం మొత్తం సామూహికంగా బహిష్కరించిన నేపథ్యంలో నటేల జలమిడ్జే వింబుల్డన్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రష్యా పౌరసత్వాన్ని సైతం వదులుకునేందుకు నటేల జలమిడ్జే సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్-2022లో ఆడే అవకాశమివ్వాలని రష్యా క్రీడాకారిణి నటేల వింబుల్డన్ నిర్వాహకులకు మొరపెట్టుకుంది. జార్జియా తరఫున ఆడతానని విజ్ఞప్తి చేస్తోంది. వింబుల్డన్-2022 టోర్నీలో సెర్బియా క్రీడాకారిణి అలెగ్జాండ్ర క్రునిక్‌తో కలిసి మహిళ డబుల్స్‌లో పాల్గొనేందుకు నటేల జలమిడ్జే పేరు రిజిస్టర్ చేసుకుంది.
వింబుల్డన్ నిర్వాహకులు తీసుకునే నిర్ణయంపై నటేల భవితవ్యం ఆధారపడి ఉంది. 44వ ర్యాంకర్ నటేల జలమిడ్జే వింబుల్డన్ టోర్నీలో రష్యా జెండా మీద పాల్గొనడం సాధ్యం కాకనే… జార్జియా తరఫున ఆడేందుకు సిద్ధమైందని సమాచారం.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మూలంగా ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, తైక్వాండో, ఫిఫా, ఎఫ్1 రేస్ వంటి ప్రఖ్యాత క్రీడా సంఘాలు రష్యాతోపాటు ఆ దేశానికి వంతుపాడుతున్న బెలారస్‌పై కూడా నిషేధం విధించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.