– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ బెర్త్ లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే టోర్నీలో అన్ని జట్లు 13 మ్యాచ్‌లు ఆడేశాయి. గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. ఢిల్లీ క్యాపిటిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తప్పుకున్నాయి. ఇక.. చెన్నై తన 14వ మ్యాచ్‌లో ఢిల్లీ మీద 77 పరుగుల విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక.. ఇవ్వాల (ఆదివారం) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో ముంబయి జట్టు ఇప్పటికే ఫోర్త్ ప్లేసులో ఉన్న బెంగళూరును దాటి నాలుగో స్థానానికి ఎగబాకింది.
ఇక.. ఇవ్వాల రాత్రి జరిగే బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య ఆట కూడా డైసిడింగ్ మ్యాచ్ కానుంది. ఇందులో బెంగళూరు తప్పకుండా విజయం సాధించి తీరాలి. అప్పుడు బెంగళూరు జట్టుకు 16 పాయింట్లతో ముంబయితో సమానంగా ఉంటుంది. దీంతో నెట్ రన్ రేట్‌ని ప్రాతిపదికగా తీసుకుంటే.. బెంగళూరు జట్టు ముందంజలో ఉండే అవకాశాలున్నాయి. ఇట్లా ముంబయికి ప్లే ఆఫ్స్‌లో చాన్స్ కోల్పేయే అవకాశం ఉంది. అదే కనుక బెంగళూరు జట్టు ఓటమి చెందితే.. ముంబయికి ప్లే ఆఫ్స్‌కి టికెట్ కన్ఫాం అవుతుంది.