Friday, November 22, 2024

IPL : గెలిస్తేనే ప్లే ఆఫ్ కు…12 పాయింట్ల‌తో రెండు జ‌ట్లు

ఐపీఎల్ మ్యాచ్ 2024 మ్యాచ్ లు చివరి అంకంలోకి చేరుతున్నాయి. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు అట్టడుగున ఉన్నారనేది ఒక అంచనాకి వచ్చేశారు. ఈ సమయంలో నేటి రాత్రి 7.30కి హైదరాబాద్ లో జరగనున్న సన్ రైజర్స్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ కి చేరాలంటే ఇక్కడ గెలవడం చాలా కీలకంగా మారింది.

- Advertisement -

ఎందుకంటే సన్ రైజర్స్, లక్నో రెండు జట్లు కూడా చెరో 12 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నాయి. అయితే రన్ రేట్ ప్రకారం హైదరాబాద్ కాస్త ముందడుగులో ఉంది. అంటే టాప్ 4 లో ఉంటే, లక్నో మాత్రం 6 వస్థానంలో ఉంది.

ఈ నేపథ్యంలో గెలిస్తే రన్ రేట్ తో సంబంధం లేకుండా ముందడుగు వేయవచ్చునని రెండు జట్లు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరిగాయి. మూడింటిలోనూ లక్నో గెలవడం విశేషం.

హైదరాబాద్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ లో నలుగురు ఆడితే మాత్రం అద్భుతాలు సృష్టిస్తోంది. లేదంటే త్వరగా వెళ్లిపోయి డగౌట్ లో కూర్చుని కావ్య పాపతో కలిసి మ్యాచ్ చూస్తున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ వీరందరూ ఆడితే స్కోరు జెట్ స్పీడ్ తో పరుగులెడుతోంది. వీరిలో ముగ్గురు అయిపోయినా కథ కంచికి చేరిపోతోంది. బౌలింగు కూడా పర్వాలేదనిపించేలా వేస్తున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో కూల్ గా ముందడుగు వేస్తోంది. పెద్ద అంచనాల్లేకుండా బాగా ఆడుతోంది. బౌలింగు, బ్యాటింగ్ అన్నింటా బాగానే ఉంది. ఓపెనర్లు డికాక్, రాహుల్ ఉన్నారు. దేవదత్ పడిక్కల్ ఒకటి ఆడితే, రెండు వదిలేస్తున్నాడు. స్టోనిస్, పూరన్ ఇంకా టచ్ లోకి రావాలి. బౌలింగు విషయానికి వస్తే కృనాల్ పాండ్యా, మయాంక్ యాదవ్, మార్కస్ స్టోనిస్, నవీన్ ఉల్ హక్ వీరందరూ ఉన్నారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే రెండు సమఉజ్జీల మధ్య పోరులో ఎవరు గెలుస్తారు? ఎవరు ప్లే అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంటారో వేచిచూడాల్సిందే.

పొంచి ఉన్న‌వ‌రుణ గండం..

సాఫీగా సాగుతున్న ఐపీఎల్‌-17కు వర్షం ముప్పు పొంచి ఉంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో ఉప్పల్‌ స్టేడియం తడిసి ముద్దయ్యింది. దీంతో ప్రధాన పిచ్‌పై గ్రౌండ్‌ సిబ్బంది కవర్లు కప్పి ఉంచారు. అవుట్‌ ఫీల్డ్‌ మొత్తం వాన నీటితో నిండిపోయింది. నగరంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో బుధవారం హైదరాబాద్‌, లక్నో మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. వర్షం వల్ల లక్నో తమ ప్రాక్టీస్‌ను కూడా రద్దు చేసుకుని హోటల్‌కే పరిమితమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement