ఐపీఎల్ 2024 సీజన్‍లో ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB).. ఆలస్యంగా భీకర ఫామ్‍లోకి వచ్చింది. ఈ సీజన్‍లో తొలి 8 మ్యాచ్‍ల్లో ఏడు ఓడి, ఒక్కటే గెలిచిన బెంగళూరు. ఇప్పుడు వరుసగా ఐదు మ్యాచ్‍ల్లో విజయం సాధించింది.
హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో నేడు (మే12) జరిగిన మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘనంగా గెలిచింది. దీంతో వరుసగా ఐదో విజయంతో ఇంకా ప్లేఆఫ్స్ ఆశలను ఆర్సీబీ నిలుపుకుంది. ఈ సీజన్‍లో బెంగళూరుకు ఇది ఆరో గెలుపు. ఈ ఓటమితో ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 6 విజయాలు, ఏడు ఓటములు సాధించింది. 12 పాయింట్లతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. లీగ్ దశలో ఆర్సీబీ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మే 18వ తేదీన చెన్నైతో జరిగే మ్యాచ్‍లో భారీగా గెలిస్తే బెంగళూరుకు ప్లేఆఫ్స్ ఆశలు ఉండొచ్చు. అయితే, మిగిలిన జట్ల సమీకరణాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‍ల్లో 6 విజయాలు, ఏడు ఓటములను చెందింది. అయితే, నెట్ రన్‍రేట్ తక్కువగా ఉండడం ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది. లీగ్ దశలో ఓ మ్యాచ్ ఉన్నా.. ఢిల్లీకి ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టమే. లక్నోతో తన చివరి లీగ్ మ్యాచ్‍ను మే 14న ఢిల్లీ ఆడనుంది.