Monday, December 23, 2024

Pink ball test – టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

అడిలైడ్‌: బీజీటీ టోర్నీలో రెండో టెస్టుకు అడిలైడ్‌లో తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే ఈ గులాబీ పోరు అభిమానులకు సరికొత్త అనుభూతి కల్గించనుంది.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ జట్టు లో రెండు మార్పులు చేసారు . పడ్డికల్ స్థానం లో రోహిత్ రాగా … వాషీ ప్లేస్ అశ్విన్ చేరాడు. యశస్వి , రాహూల్ లు ఓపెనర్లు గా బరిలోకి దిగుతుండగా రోహిత్ మిడ్డిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయనున్నాడు.

కాగా, చాలా రోజుల తర్వాత డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడబోతున్న టీమ్‌ఇండియా అందుకు తగ్గట్లు ప్రాక్టీస్‌లో చెమటోడ్చింది. రెండో టెస్టుకు ముందు పీఎం లెవన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ ఆకట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌..అడిలైడ్‌లోనూ తమ ప్రతాపం చూపించేందుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. పెర్త్‌కు భిన్నంగా స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్న అడిలైడ్‌ పిచ్‌ ఎవరికి సహకరిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement