పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రవూఫ్కు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారీ షాకిచ్చింది. అతని సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయడంతో పాటు టీ20 లీగ్లలో పాల్గొనకుండా అడ్డుకట్ట వేసింది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో హరీస్కు ఆడాలని పీసీబీ పలుమార్లు కోరినా అతడు విముఖత చూపాడు.
దాంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పాక్ క్రికెట్ బోర్డు రవూఫ్పై క్రమశిక్షణా చర్యలకు దిగింది. టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని పీసీబీకి తెలుపలేదు. అందుకే అతడి కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో విచారణ జరిపిస్తామని పేర్కొంది. పీసీబీ తాజా ఆదేశాలతో రవూఫ్ ఈ ఏడాది జూన్ 30 దాకా జరిగే టీ20 లీగ్లలో పాల్గొనలేడు.