హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇవాళ 53వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సీఎస్కే బ్యాటర్లు తడబడి ఆడతూ వికెట్లను కోల్పోయారు. 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 168 పరుగులు చేయాల్సి ఉంది..
ముందుగా పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేపట్టింది. అయితే బ్యాటర్లు తడబడడంతో సీఎస్కే జట్టు ఆశించినంత స్కోర్ చేయలేకపోయింది. ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. బ్యాట్స్ మెన్లు రవీంద్ర జడేజా 43 పరుగులు , కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులు, డారీ మిట్చెల్ 30 పరుగులు, మొయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్ 17 పరుగుల చొప్పున చేశారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేశారు.
ఇక పంజాబ్ బౌలర్లు బౌలింగ్ అద్భుతంగా చేసి భారీ స్కోరును కట్టడి చేశారు. రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీయగా, అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు, శామ్ కర్రన్ ఒక వికెట్ చొప్పున తీశారు.