ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు మరో వారం కూడా సమయం లేదు. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కేకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆ జట్టు కీలక పేసర్ గాయంతో దూరమయ్యాడు. 6న సిల్హెట్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో చెన్నై స్టార్ పేసర్ మతీషా పతిరానా గాయపడ్డాడు. అతను కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
గత ఐపీఎల్‌లో చెన్నై కప్ గెలవడంలో పతిరనా కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి జట్టు విజయాల్లో మంచి పాత్ర పోషించాడు. ఇప్పటికే ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే బొటన వేలి గాయం కారణంగా ఐపీఎల్ తొలి దశ మ్యాచులకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో అతడి వేలికి గాయమైంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
సీఎస్కే జట్టు:
ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరానా, అజింక్యా రహానే, సిమ్‌చెర్లెల్లత్, షేక్ రషెద్నెర్, షేక్ రాషేద్నెర్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి.