Friday, November 22, 2024

Sports: స్టార్ షట్లర్ కశ్యప్ కు గాయం.. ఆరు వారాలపాటు ఆటకు దూరం..

కామన్వెల్త్ క్రీడల మాజీ చాంపియన్.. షట్లర్ పారుపల్లి కశ్యప్ కు గాయమైంది. కండరాల గాయం కారణంగా ఆరు వారాల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. జట్టుకు అందుబాటులోకి వచ్చేది తర్వాత తెలియజేస్తానని తెలిపాడు కశ్యప్. గత నెలలో హైదరాబాద్‌లో (డిసెంబర్ 24, -30) జరిగిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో కశ్యప్ కు కండరాలు పట్టేశాయి.

“నేను హైదరాబాద్ ఓపెన్ ఆడాను, మొదటి రౌండ్‌లో గాయపడ్డా, ప్రస్తుతానికి బాగానే ఉన్నా. కానీ, నేను మ్యాచ్‌కి సరిపోలేనని అనిపిస్తుంది” అని పీటీఐ వార్త సంస్థతో మాట్లాడుతూ కశ్యప్ నిరాశ వ్యక్తం చేశాడు. అట్లా ఎందుకు జరిగిందో కచ్చితంగా తెలియదని చెప్పాడు. ఫిట్‌గా ఉన్నానని అనుకుంటున్నా.. కానీ, కండరాలు పట్టేయడంతో ఆటపై ఫోకస్ చేయలేకపోతున్నా.. మొత్తం మ్యాచ్‌ ఆడేలా కండరాలకు బలం ఓర్పు సరిపోవడం లేదు అని తెలిపాడు..

35 ఏళ్ల కశ్యప్ 2014లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించినప్పటి నుంచి తరచూ గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. మరో సంవత్సరం తర్వాత చెన్నై, హైదరాబాద్‌లో జరిగిన రెండు ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లలో మంచి ఔటింగ్‌ల కోసం వెయిట్ చేస్తున్నాడు. గాయం కారణంగా కశ్యప్ ఇండియా ఓపెన్ సూపర్ 500తో ప్రారంభించి దేశంలో జరిగే మూడు ఈవెంట్‌లలో పాల్గొనలేడు. రానున్న మార్చి వరకు తను జట్టుతో అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించారడు పారుపల్లి కశ్యప్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement