Friday, September 20, 2024

Paris Olympics | తొలి రౌండ్‌లోనే నాగ‌ల్ ఇంటికి..

విశ్వ క్రీడ‌ల్లో భార‌త టెన్నిస్ కెర‌టం సుమిత్ నాగ‌ల్ పోరాట ముగిసింది. ఈ ఏడాది సంచ‌ల‌న విజ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచిన నాగ‌ల్ తొలి రౌండ్‌లోనే నాగ‌ల్ ఇంటిదారి ప‌ట్టాడు. ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో కొరెంటిన్ మౌటెట్(ఫ్రాన్స్) ధాటికి భార‌త ఆట‌గాడు నిల‌వ‌లేక‌పోయాడు. రెండు గంట‌ల 28 నిమిషాల పాటు జ‌రిగిన మ్యాచ్‌లో 2-6, 6-2, 5-7తో నాగ‌ల్ ఓట‌మి పాల‌య్యాడు.

కెరీర్‌లో తొలి ఒలింపిక్స్ ఆడుతున్న నాగ‌ల్ నిరాశ‌ప‌రిచాడు. కొరెంటెన్ తొలి సెట్ ఓడిన నాగ‌ల్ రెండో సెట్‌లో పుంజుకున్నాడు. 6-2తో సెట్ గెలుపొంది ప్ర‌త్య‌ర్ధి జోరుకు చెక్ పెట్టాడు. అయితే.. నిర్ణ‌యాత్మ‌క మూడో సెట్‌లో మాత్రం కొరెంటిన్ గ‌ట్టి పోటీనిచ్చాడు. నాగ‌ల్‌కు ఏమాత్రం చాన్స్ ఇవ్వ‌కుండా 7-5తో పైచేయి సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement